తుగ్లక్ పాలనను ప్రశ్నించినందుకే కక్షగట్టారు: లోకేశ్

by srinivas |
తుగ్లక్ పాలనను ప్రశ్నించినందుకే కక్షగట్టారు: లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా ట్వీట్లు చేసిన ఆయన, ‘శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి గారి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్.. బీసీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు’ అని ఆయన అన్నారు. మరో ట్వీట్‌లో ‘బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు. రూ. లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే’ అని ఎద్దేవా చేశారు. ఇంకో ట్వీట్‌లో ‘రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది, ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు. బడుగు, బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది’ అంటూ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed