- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యటన
దిశ, ఏపీ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, డా.గురుమూర్తిలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు శ్రీపద్మావతి ఆలయానికి చేరుకున్నారు. తిరుచానూరు పద్మావతి ఆలయం వద్ద లోక్ సభ స్పీకర్‌కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో సదా భార్గవి ఇతర సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కుకున్న అనంతరం ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఓం బిర్లా కుటుంబ సభ్యులు పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు త్వరగా కోలుకోవాలన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజల అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని..వైకుంఠ దర్శనం చేసుకున్నారు.
స్పీకర్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో సదా భార్గవిలు ఉన్నారు. అక్కడ నుంచి తిరుమల శ్రీకృష్ణ వసతిగృహంలో స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పద్మావతి వసతిగృహంలో టీటీడీ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. అనంతరం తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత తిరుపతి కపిలేశ్వర స్వామి, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. దర్శనం పూర్తైన తర్వాత ఢిల్లీ బయలుదేరతారు.