TRS ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం.. సభ వాయిదా

by Shamantha N |
TRS ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం.. సభ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తమ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లపైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిలబడి నిరసన తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలపడంతో స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఆందోళన విరమించి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ కోరారు. కానీ, ఎంపీలు స్పీకర్ మాట వినకపోవడంతో సభను ఓం బిర్లా అరగంట పాటు వాయిదా వేశారు.

Advertisement

Next Story