లోక్‌సభ నిరవధిక వాయిదా

by Shamantha N |
లోక్‌సభ నిరవధిక వాయిదా
X

పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో లోకసభను వాయిదావేశారు. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజే పెద్దల సభను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది.

Tags: lok sabha session adjourned



Next Story

Most Viewed