మిడతలు వచ్చే ఛాన్సుంది… జాగ్రత్త : నిర్మల్ కలెక్టర్

by Aamani |
మిడతలు వచ్చే ఛాన్సుంది… జాగ్రత్త : నిర్మల్ కలెక్టర్
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాకు మిడతల బెడద పొంచి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వాటి బారి నుంచి రైతులతోపాటు జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే మిడతలు మహారాష్ట్ర సరిహద్దుకు వచ్చాయని సమాచారం ఉందన్నారు. జిల్లా సరిహద్దుల్లో మిడతలు రాకుండా రసాయనాల మందులతో, ఫైర్ ఇంజిన్లతో సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రసాయన మందుల వినియోగం సందర్భంగా ప్రజలు ఎవరైనా అస్వస్థతకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, వ్యవసాయ, పోలీసు, ఫైర్ శాఖలు సంయుక్తంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు, డీఎం అండ్ హెచ్ఓ వసంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed