మిడతల బెడదను తప్పించుకోండిలా!

by  |
మిడతల బెడదను తప్పించుకోండిలా!
X

కరోనా కష్టం నుంచి గట్టెక్కముందే మిడతల దాడి రూపంలో మరో కష్టం ఎదురైంది. తూర్పు ఆఫ్రికా నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన మిడతల గుంపు రైతులను ఇబ్బందిపెడుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే బీభత్సం సృష్టిస్తుండగా.. ఈ మిడతల దండును తరిమేందుకు రైతులు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొందరు పొలాల్లో ప్లేట్లను కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటే.. మరికొందరు ఏకంగా డీజే పాటలు మోగిస్తున్నారు. ఇంకొందరు రాత్రివేళల్లో మిడతల దండుపై రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఐతే ఇవన్నీ వేస్ట్.. ఓ చక్కని పరిష్కారం ఉందంటూ సోషల్ మీడియాలో వెలసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి.

‘మిడతలు కనిపిస్తే.. కాల్చుకొని తినేయడమే’ అని పలువురు నెటిజన్లు సరదాగా అభిప్రాయపడుతున్నారు. మిడతల దండు గురించి టెన్షన్ ఎందుకు.. ఎంచక్కా ఫ్రై చేసుకొని లాగించండని చెబుతున్నారు. పలు రకరకాల మిడతల వేపుళ్ల గురించి పోస్ట్‌ చేస్తున్నారు. మిడతల దండును ముప్పుగా భావించకుండా చక్కని అవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. రకరకాల, రుచికరమైన వంటకాలను సిద్ధం చేసుకోవచ్చని, అవసరమైతే చిన్న క్యాంటిన్ పెట్టి మిడత వంటకాలను అమ్ముకోచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక చేసేదేం లేదు.. డిస్కవరీలో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ మాదిరిగా పచ్చివి తినేసినా ప్రోటీన్లు దొరుకుతాయని జోకులు పేలుస్తున్నారు.


Next Story