- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలోని ఆ జిల్లాలో స్వచ్ఛంద లాక్ డౌన్
దిశ ఖానాపూర్: చిన్న ,పెద్ద,పేదవాడు, ధనవంతుడు అనే తేడా లేకుండా మాయదారి వ్యాధి కరోనా కాటుకు రోజు రోజుకు ఎంతోమంది బలి అవుతున్నారు. దీంతో పల్లె ప్రజల్లో భయం మొదలైంది. ఎప్పుడు ఏ వార్త వినిపిస్తోందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి గ్రామంలో శనివారం యువకుడు గంగాధర్(30) కరోనాతో మృతి చెందాడు. కాగా మరుసటిరోజు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఇద్దరూ మహిళలు సత్తవ్వ, శాంత కరోనా తో మరణించారు. శాంత కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆక్సిజన్ పెట్టమని, మేము పేదోవాళ్లం నా మంగళి సూత్రాలు అమ్మి వైద్యం అందించండి అని ఆర్తనాదాలు పెట్టిన కరోనా కాటుకు బలికాక తప్పలేదు.
ఆమె ఆర్తనాదాలు వీడియో వాట్సాప్ గ్రూపులో చెక్కర్లు కొడుతుంది. మస్కాపూర్ లోని మహిళ మంగళవారం ఆదిలాబాద్ నిమ్స్ లో మృతి చెందగా ఆమె శవానికి దహన సంస్కారాలు ఆదిలాబాద్ లో చేశారు. కడం మండలంలోని ధర్మోజి పెట్ లో చౌకదార షాప్ డీలర్ కరోనాతో మరణించాడు. రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్ మరణ వార్తలు వినడంతో పల్లె ప్రజలలో వణుకు మొదలైంది. దీంతో ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి, సుర్జాపూర్, ఖానాపూర్ పట్టణం లో, పెంబి మండలం లో మందపల్లి, పెంబి దస్తురాబాద్, కడం మండలకేంద్రలోను, ఆయా గ్రామాలలో స్వచ్ఛందం గా లాక్ డౌన్ విధించారు.