- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ నిబంధనలు ఇవే…
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే ఉద్దేశంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘిస్తూ వాహనదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.
– ప్రజారోగ్యం కోసం ఈరోజు నుంచి మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.
– పబ్లిక్, ప్రైవేట్ వెహికిల్స్‌కు మాత్రమే అనుమతి ఉంది.
– ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ప్రైవేట్ వెహికిల్స్ ఉపయోగించాలి.
– వచ్చే వారం, పది రోజులు ప్రజలు క్రమశిక్షణతో ఉండాలి.
– కరోనాను అరికట్టాలంటే ప్రజలు రోడ్లపైకి రావొద్దు.
– పోలీసులకు ప్రజలు సహకరించాలి.
– తెలంగాణ సమాజం కోసం పోలీసులు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు.
– అజాగ్రత్తగా వ్యవహరిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– పగటి సమయంలో తెరిచి ఉండే నిత్యావసర వస్తువుల దుకాణాలను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తాం.
– ఒక కాలనీ పరిధిలోని వాహనం 1 లేదా 2 కి.మీ.లు మాత్రమే తిరగాలి.
– ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.
– ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు. ఎక్కువసార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.
– సీజ్ చేసిన వాహనాలను కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతనే రిలీజ్ చేస్తారు.
– ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువుల సరఫరాకు మాత్రమే అనుమతిస్తారు.
– మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతి ఉంది.
– నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు.
– ప్రతి బైక్‌పై ఒకరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి.
– ఈరోజు మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్‌డౌన్ అమలు.
– అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాం.
– ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులను మూసివేశాం.
– ఎమర్జెన్సీ, సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చాం.
– రవాణా సేవలు అన్ని బంద్ చేశాం.
– అత్యవసర సామగ్రికి మినహాయింపు ఇచ్చాం.
– ఐదుగురికి మించి రోడ్లపై రావడానికి వీల్లేదు.
– జీవో 45 ప్రకారం అన్ని సేవలపై మినహాయింపు.
– ఎన్‌ఆర్‌డీఎఫ్ సిబ్బంది తమ విధులను కొనసాగిస్తారు.
– ఇతర దేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ సెంటర్లకు వెళ్ళాలి.
– ఎన్‌ఆర్‌ఐలు నిబంధనలు అతిక్రమిస్తే పాస్‌పోర్టులను సీజ్ చేస్తాం.
– మెడికల్ ఎమర్జెన్సీలకు మాత్రమే అనుమతి ఇస్తాం.
– ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలి.
Tags: corona virus, lockdown Rules, serious action