భువనగిరిలో డ్రోన్ కెమెరాలతో లాక్‌డౌన్ పర్యవేక్షణ

by  |
భువనగిరిలో డ్రోన్ కెమెరాలతో లాక్‌డౌన్ పర్యవేక్షణ
X

దిశ, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరును డీసీపీ నారాయణ డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తేనే వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని డీసీపీ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించొద్దని ప్రజలకు సూచించారు. భువనగిరి పట్టణంలో డ్రోన్ కెమెరాతో భద్రతను పర్యవేక్షించారు. అనంతరం వలిగొండలో లారీ డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రైవర్లకు వివరించారు.

Tags: DCP narayana Lockdown, monitoring, drone cameras

Advertisement

Next Story

Most Viewed