- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లాక్‌డౌన్.?
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కరోనా పంజా విసురుతోంది. సాగర్‌లో ఇప్పటికే వివిధ పార్టీల నేతలు, అధికారులు కరోనా బారినపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా విస్తరించింది. దీంతో కేసీఆర్ సభలో ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్ క్వారెంటైన్ కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గంలో పరిస్థితి చేజారక ముందే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తున్నట్టు సమాచారం. తాజాగా సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడినట్టు సమాచారం. అలాగే, అధికార పార్టీ ముఖ్య నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇదే క్రమంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. ఇప్పటి వరకు సాగర్ నియోజకవర్గంలోని పెద్దపూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడులో 11, నిడమనూర్‌లో 7, సాగర్‌లో 17 కేసులు నమోదు అయ్యాయి. సాగర్ పరిధిలో నేడు 160 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.