భ‌ద్రాచ‌లంలో రేప‌టి నుంచి లాక్‌డౌన్

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాచలంలో క‌రోనా రోగుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా సోమ‌వారం నుంచి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పొందెం వీర‌య్య తెలిపారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, వ్యాపార వ‌ర్గాలు, అఖిల‌ప‌క్ష నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో అన్ని వ‌ర్గాల నుంచి లాక్‌డౌన్ అమ‌లుకు మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఈ మేర‌కు సోమ‌వారం నుంచి ఈనెల 20వ తేదీ వ‌ర‌కు మధ్యాహ్నం రెండు త‌ర్వాత స్వ‌చ్ఛంద బంద్ పాటించాల‌ని నిర్ణ‌యించారు. 2 గంట‌ల త‌ర్వాత వ్యాపారాలు సంపూర్ణంగా బంద్ చేయాల‌ని సూచించారు.

Advertisement