- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిషాలో లాక్‌డౌన్ పొడిగింపు
లాక్ డౌన్‌పై ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. దీంతో లాక్ డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రంగా ఒడిషా నిలిచింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థలు జూన్ 17 వరకు తెరవబోమని సర్కార్ ప్రకటించింది. లాక్ డౌన్ పొడిగింపు పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని , కేంద్రం కూడా దేశవ్యాప్తంగా పొడిగించాలని కోరినట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు. కాగా, ఒడిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42 గా నమోదు కాగా, ఇప్పటి వరకు ఒక్కరు మరణించారు.
కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఈ నెల 14న ముగుస్తుంది. అయితే లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే దానిపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 11న ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎంలతో చర్చించి లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Tags: lockdown, extension, odisha, national news