Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు

by Shamantha N |   ( Updated:2021-05-16 06:16:50.0  )
Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు. సోమవారం ఉదయం ఐదుగంటలతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కేసులు అమాంతం పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 19న లాక్‌డౌన్ విధించింది. తాజాగా, దానిని నాలుగోసారి పొడిగించింది. లాక్‌డౌన్ కాలంలో కేసులు తగ్గుముఖం పట్టాయని, పాజిటివిటీ క్రమంగా తగ్గుతున్నదని, ఇంకా 5శాతం దిగువకు చేరాల్సి ఉన్నదని సీఎం కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. రికవరీలు ఎక్కువే అవుతున్నాయని వివరించారు. అయితే, ఇన్నాళ్ల లాక్‌డౌన్‌తో అదుపులోకి తెచ్చుకున్న పరిస్థితులను ఉన్నపళంగా లాక్‌డౌన్ ఎత్తేసి పోగొట్టుకోవాలనుకోవట్లేదని తెలిపారు. అందుకే లాక్‌డౌన్‌ను మరో వారంపాటు పొడిగించుతున్నట్టు చెప్పారు. ఢిల్లీలో మరో వారంపాటు అంటే వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు.



Next Story

Most Viewed