లాక్‌డౌన్ ఎఫెక్ట్ : మెడికల్ దుకాణాల్లో క్యూ

by Shyam |
Medical Stores
X

దిశ, తెలంగాణ బ్యూరో: లాక్‌డౌన్ ప్రకటనతో మెడికల్ దుకాణాల ముందు జనం క్యూ కట్టారు. అత్యవసర సమయంలో అవసరమైన మందులను, కొవిడ్ మందులను కొనుగోలు చేసేందుకు మెడికల్ దుకాణాల దగ్గర బారులు తీరారు. మందుల కొరత ఏర్పడుతుందని పుకార్లు పట్టడంతో ముందస్తుగా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. లాక్ డౌన్‌‌లో మెడికల్ దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిసినప్పటికీ అధికంగా మందుల కొనుగోలు చేపడుతున్నారు.

లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు, మెడికల్ దుకాణాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిసినా కాని జనంలో కంగారు మొదలైంది. సీఎం కేసీఆర్ కొవిడ్ కిట్ మందులను ప్రకటించనప్పటి నుంచి వాటికి డిమాండ్ పెరిగింది. బ్లాక్ మార్కెట్‌కు తెరలేపి రెండు, మూడు రోజుల పాటు అధిక ధరలకు విక్రయాలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో మందుల కొరత ఏర్పడుతుందని పుకార్లు సృష్టించారు. దీంతో కావల్సిన మందులను కొనుగోలు చేసేందుకు మెడికల్ దుకాణాలకు జనం పరుగులు పెట్టారు.

కొవిడ్ కిట్ మందులను, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులను, అత్యవసర సమయంలో వినియోగించే మందులను ముందస్తుగా కొనుగోలు చేశారు. లాక్‌డౌన్ లో ఎలాంటి విషమ పరిస్థితులు ఏర్పడుతాయోననే భయంతో అవసరాలకు మించి మందులను సేకరిస్తున్నారు, మంగళవారం ఏ మెడికల్ దుకాణాల మందు చూసిన భారీ క్యూలు దర్శనమిచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed