పెద్దపల్లిలో సెల్ఫ్ లాక్ డౌన్

by Shyam |   ( Updated:12 July 2020 4:06 AM  )
పెద్దపల్లిలో సెల్ఫ్ లాక్ డౌన్
X

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ పాటించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల పెద్దపల్లి పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో స్వీయ నిర్భందం పాటించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో పెద్దపల్లి కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే 13వ తేది నుండి పది రోజుల పాటు వ్యాపార వాణిజ్య దుకాణాలను మూసి వేయడంతో పాటు ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.

Next Story

Most Viewed