- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేగుంటలో ఈ నెల 12 నుంచి..
by Shyam |

X
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేగుంటలో పది రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసినట్లు సర్పంచ్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 21 వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. కేవలం కూరగాయలు, పాల దుకాణాలు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు మెడికల్ షాపులు సాయంత్రం వరకు తెరచి ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మంగళవారం సరుకుల కొనుగోళ్లకు కిరాణా దుకాణాలకు బారులు తీరారు. దీంతో అన్ని దుకాణాలు కిటకిటలాడాయి.
Next Story