- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వర్షం పడితే షాపులు బంద్.. ఇంకెన్నాళ్లు..!
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన మండలంగా చిట్యాల కొనసాగుతోంది. అటువంటి మండల కేంద్రంలో పాలకులు రోడ్ల ఇరువైపుల కాలువలు నిర్మించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిట్యాలలో డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. భారీ వర్షం కురిస్తే ఇండ్లు, రోడ్డుకు ఇరువైపుల ఉన్న షాపుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా షాపుల యజమానులు నీళ్లలోనే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కొన్నేండ్లుగా సీజనల్ సమస్యలపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో రోడ్ల వెంట అడపాదడపా పనులు మాత్రమే చేయించి నాయకులు, అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదని శాశ్వత పరిష్కారం చూపాలని మండల వాసులు కోరుతున్నారు.
గత 20 ఏళ్ల నుంచి చిట్యాల చౌరస్తా నుంచి స్థానిక పశువుల దవాఖాన వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీలు లేవు. దీంతో భారీ వర్షం కురిస్తే ఇండ్లు, షాపుల్లోకి వరద నీరు చేరుతోంది. ఈ ప్రభావంతో చాలా మంది షాపులను మూసివేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా వరద నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు సైడ్ డ్రైనేజ్‌లను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.