పాల్వంచలో యువకుడికి దేహశుద్ధి

దిశ, వెబ్‌డెస్క్: తనకు చాలా పెద్దొళ్లు తెలుసని మాయమాటలు చెప్పి 20ఏళ్ల యువతిని తీసుకెళ్లి, ఇంతవరకు తీసుకురాని యువకుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చితకబాదారు. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లకు చెందిన యువతికి రెగళ్లకు చెందిన రాపర్తి ప్రసాద్ పరిచయమయ్యాడు. మాయ మాటలతో ఉద్యోగం ఆశ చూపిన ప్రసాద్.. ఆమెను తీసుకెళ్లి రోజులు గడుస్తున్నా తీసుకురాలేదు. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉందో కూడా చెప్పలేదు. దీంతో తమ కూతురు ఏమైందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెతుకుతుండగా… పాల్వంచ నటరాజ్ సెంటర్‌లో ప్రసాద్ తారసపడగా చితకబాదారు. యువకుడు ఏం చెప్పకుండా మాటలు దాట వేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement