- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారం వ్యవధిలోనే ఇద్దరూ బలి.. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లడం కోసమే..!
దిశ, బేగంపేట: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన వారు రోడ్డు ప్రమాదానికి గురై వారం వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నార్త్ జోన్ పరిధిలోని బేగంపేట మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్త ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్యాట్నీ సమీపంలో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మరువక ముందే శుక్రవారం మరో రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ జర్నలిస్టును లారీ ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సాధారణంగా బేగంపేట రోడ్డు బాగానే ఉంది.
అయినా వారం రోజుల క్రితం మరోసారి రోడ్డు తవ్వారు. కిలోమీటర్ల పొడవునా అస్తవ్యస్తం చేసి అలానే వదిలేశారు. ఈ రోడ్డుపై ఎలా వెళ్లినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సార్లు హెల్మెట్‌లు ఉన్నా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ రోడ్డుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ తిరుగుతుంటుంది. క్యాంప్ ఆఫీస్‌కు, పామ్ హౌస్‌కు ఆయన ఈ రోడ్డు గుండానే వెళ్తారు. కేసీఆర్ కాన్వాయ్ సాఫీగా వెళ్లడం కోసమే బాగున్న రోడ్లను తవ్వతున్నారనీ స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.