భారతదేశంలో వాట్సాప్ ద్వారా డబ్బు రుణాలు?

by  |
భారతదేశంలో వాట్సాప్ ద్వారా డబ్బు రుణాలు?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో వాట్సాప్ పేమెంట్ తనదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమ డిజిటల్ చెల్లింపుల సేవ ద్వారా కేవలం డబ్బు సరఫరాలు మాత్రమే కాకుండా కొన్ని షరతులతో వినియోగదారులకు ముందస్తుగా డబ్బు రుణంగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇది కేవలం భారతీయ వినియోగదారులకే పరిమితం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బ్యాంకింగ్ బిజినెస్ చేయడానికి వాట్సాప్ కంపెనీకి అనుమతి లేని కారణంగా ఈ రుణాల విధానాన్ని అమలు చేయడానికి ఏదో ఒక థర్డ్ పార్టీ బ్యాంకు సాయం అవసరమవుతుంది. ఇటీవల వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్, రిలయన్స్ జియోతో డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జియో సాయపడనుందుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018 నుంచి వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ ఉన్నప్పటికి వివిధ అనుమతులు, పరిమితుల కారణంగా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే 400 మిలియన్ల భారతీయ యూజర్లు ఉండటంతో వాట్సాప్ పేమెంట్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఇప్పటికే ఉన్న గూగుల్‌పే, ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ సర్వీసులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ ఏడాది చివర్లో వాట్సాప్ పేమెంట్ కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Tags – Whatsapp, payments, Digital payment, phonepe, loans, users, money


Next Story

Most Viewed