ఎల్‌కే అడ్వాణీ, ఎంఎం జోషీలకూ ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ నేత ఉమా భారతితోపాటు సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, ఎంఎం జోషీలకూ ఫోన్ ద్వారా ఆహ్వానం అందింది. ఆగస్టు 4 సాయంత్రం అయోధ్యకు వచ్చి 6వ తేదీ వరకు అక్కడే ఉండాలని రామజన్మ భూమి న్యాస్‌ అధికారి ఒకరు తనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్టు ఉమా భారత ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు ఆహ్వానం అందలేదని శనివారం కథనాలు వచ్చాయి. అయితే, వారినీ ఫోన్ ద్వారా ఆహ్వానించినట్టు రామ్ టెంపు ట్రస్టు వర్గాలు తెలిపాయి. కాగా, వీరిరువురు ఆరోగ్య పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కార్యంలో పాలుపంచుకోనున్నట్టు ఇంకొన్ని వర్గాలు వెల్లడించాయి.

Advertisement