- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనమా.. ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. రామాయణంలోని రాముడి పాత్రతో ప్రధానిని పోల్చుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సమయంలో తాను ప్రధాని మోడీకి నమ్మిన బంటును అని, ప్రధాని మోడీ రాముడైతే తాను హనుమంతుడిని అని చిరాగ్ చెప్పిన విషయం తెలిసిందే. రాముడి ప్రతి నిర్ణయానికి హనుమంతుడు బాసటగా నిలిచాడని తెలిపారు. హనుమంతుడు రాముడి అడుగులో అడుగు వేసి నడిచేవాడంటూ పేర్కొన్నారు. ఎల్‌జేపీ బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతిస్తూ రాముడికి హనుమంతుడి మాదిరి తోడుగా ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్‌జేపీ సంక్షోభంలో ఉంటే బీజేపీ బీజేపీ జోక్యం చేసుకొని పరిష్కరిస్తుందని ఆశిస్తామని కానీ.. బీజేపీ మౌనం తనకు విచారం కలిగిస్తోందని చిరాగ్ పేర్కొన్నారు.