రక్షణ శాఖ కీలక నిర్ణయం.. చైనా ఫోన్లు పారేయాలని పిలుపు

by vinod kumar |   ( Updated:2021-09-27 06:34:14.0  )
రక్షణ శాఖ కీలక నిర్ణయం.. చైనా ఫోన్లు పారేయాలని పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనా చేస్తోన్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోని పేద దేశాలకు అప్పులు కుప్పలుగా పోసి తనకు అనుకూలంగా మార్చుకుంటూ పోతోంది. అయితే దాని విస్తరణ వాదానికి చెక్ పెట్టేందుకు లిథువేనియా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ఫోన్లు కనిపిస్తే చాలు విసిరి కొట్టండి.. అవి మన దేశ రక్షణకు కీడు చేస్తాయి అనే మాట ఇప్పుడు సామాన్యుల దగ్గరి నుంచి అధికారుల దగ్గరి వరకూ గట్టిగా వినిపిస్తోంది. రక్షణ శాఖ అధికారి బయటకు వచ్చి ఏకంగా ఓ ప్రకటన చేశాడు.

చైనా ఫోన్‌లతో పాటు షావోమి, హువావే లాంటి మోబైల్స్ ను కూడా వాడకూడదని పిలుపు నిచ్చింది అక్కడి ప్రభుత్వం. వారి కారణాలు వారికి ఉన్న ప్రపంచ దేశాలు మాత్రం లిథువేనియా తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్య పోతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్‌ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

ఆ సెన్సార్‌ షిప్‌ వల్ల చైనా స్మార్ట్‌ ఫోన్‌లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది. ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్రసీ మూవ్‌మెంట్ పదాల్ని బ్లాక్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్‌లతో పాటు షియోమీ ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

దీంతో ఆ దేశాధినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్‌ ఫోన్‌లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్‌ షిప్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లను విసిరి పడేయండి’ అని లిథుయేనియా ర‌క్షణ శాఖ స‌హాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియ‌స్ ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోప‌ణ‌ల‌పై షియోమీ సంస్థ ఖండించింది. త‌మ ఫోన్లలో అలాంటి సెన్సార్‌షిప్ లేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed