- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జే-ట్యాక్స్ కోసమే మద్యానికి అనుమతులు: చంద్రబాబు
జే-ట్యాక్స్ కోసమే మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాదులోని నివాసం నుంచి పార్టీ సీనియర్ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో మద్యం దుకాణాలు తెరిచి, ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని అన్నారు. మద్యం దుకాణాల వద్ద గుంపులతో కరోనా పెరిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హెచ్చరించారు.
మద్యంపై ఆదాయం ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్య నిషేధానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుందని అన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడడం అమానుషమని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట చేసిన భూసేకరణలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. భూములు మెరక చేయడం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో భూసేకరణే వైఎస్సార్సీపీ దోపిడీకి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. గోదావరి ముంపు ప్రాంతం ఆవ భూముల్లోనూ పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. అక్కడ ఎకరం 7 లక్షల రూపాయల విలువ చేసే భూమిని 30 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. మడ అడవులను కొట్టేసి మెరక చేయడంలో కూడా వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారిందని, వాస్తవ ధరకు 6 రెట్లు ఎక్కువగా కొని వాటాలు పంచుకుంటున్నారని ఆయన విమర్శించారు.
Tags: tdp, ysrcp, chandrababu naidu, babu on liquor shopes opening