- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌శాఖ దాడులు
దిశ, నల్లగొండ: నల్గొండ జిల్లాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. మంగళవారం నారాయణపురం మండలంలోని జనగాం, వాయిల పల్లి, నారాయణపురం వాచ్య తండాలో పోలీసులు సోదాలు చేశారు. భువనగిరి డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట, భువనగిరి ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ బృందం మండలంలోని వాచ్యతండా, డాకుతండాల్లోని ఇళ్లు, వ్యవసాయ బావుల సమీపంలో సోదాలు చేశారు.బావుల వద్ద సారా కాయడానికి ఉపయోగించే రెండు పాత కుండలను పగులగొట్టారు. అనంతరం ఆ తండాల్లో ప్రజలతో మాట్లాడుతూ.. గుడుంబా కాస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం మండలంలోని జనగాం, వాయిల పల్లి, నారాయణపురం గ్రామాల్లోని కిరాణం షాపుల్లో సోదాలు నిర్వహించారు. అధిక మొత్తంలో బెల్లం నిల్వలు ఉన్నట్టుగుర్తించారు. పెద్ద మొత్తంలో బెల్లం నిల్వ చేసిన షాపు యజమానులను హెచ్చరించారు. మరోసారి బెల్లం నిల్వలు కనబడితే కేసులు పెడతామని తెలిపారు.
Tag: illegal gudumba, making, reserves, excise police, rides, nalgonda
slug ; excise police rides on illegal gudumba reserves