మందుబాబుల దండయాత్ర.. 3 గంటల్లోనే మద్యం స్టాక్ ఔట్..

by Shyam |   ( Updated:2021-05-11 07:16:11.0  )
మందుబాబుల దండయాత్ర.. 3 గంటల్లోనే మద్యం స్టాక్ ఔట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ పెడుతున్నారని తెలియగానే మందుబాబులు ఆగమయ్యారు. తమ ముఖ్యమైన పనులన్నింటినీ మానుకుని ముందుగా వైన్స్ దుకాణాల ఎదుట బారులు తీరారు. కొవిడ్ నిబంధనలకు తూట్లు పోడుస్తూ కొత్త సినిమా రిలీజ్ నాడు టిక్కెట్ల కోసం ఎలా ఎగబడుతారో అదే సీన్ నగరంలోని పలు వైన్స్ షాపుల ఎదుట దర్శనమిచ్చింది. బ్రాండ్స్‌తో సంబంధం లేకుండా పదిరోజులకు సరిపడా మద్యం బాటిళ్లను కొనుక్కుని పోయారు.

ఒక్కో మద్యం దుకాణం ఎదుట కిలో మేటరు మేర క్యూలైన్ ఉండటంతో ఒక్క దెబ్బకు స్టాక్ మొత్తం అయిపోయినట్లు తెలుస్తోంది. రెండు నుంచి మూడు రోజులకు సరిపడా స్టాక్ మొత్తం కేవలం మూడు గంటల్లోనే ఖాళీ అయిందని మద్యం షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడంతో మద్యం దుకాణాలు మూసి ఉంటాయనే భయంతో నగరవాసులు మద్యం దుకాణాలపై దండయాత్ర చేసినట్లు తెలుస్తోంది. అయితే, మద్యం దుకాణాల ఎదుట కొవిడ్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ మందుబాబులు విచ్చలవిడిగా వ్యవహరించినా పోలీసులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Advertisement

Next Story

Most Viewed