ఆ ప్రక్రియతో అనుమతులు సులభతరం: శ్రీనివాస్ గౌడ్

by Shyam |
ఆ ప్రక్రియతో అనుమతులు సులభతరం: శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక శాఖకు టీఎస్​.ఐపాస్​ను అనుసంధానం చేయడం ద్వారా సింగిల్ విండో ద్వారా అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ విధానం ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీ, ఈవెంట్స్ అనుమతులు, రెన్యువల్ లకు త్వరితగతిన అనుమతులు పొందేందుకు ఈ వెబ్ సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. టీఎస్-ఐపాస్ విధానానికి తెలంగాణ పర్యాటక శాఖ సేవలు అనుసంధానంపై టూరిజం ప్లాజాలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్ ద్వారా పర్యాటక శాఖ సేవలను ప్రారంభించారు.

పర్యాటకంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమన్నారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ.. మలేషియా, సింగపూర్ వంటి దేశాలు పర్యాటకం మీద వచ్చే ఆదాయం పైనే అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. తెలంగాణకు పర్యాటక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయనీ… రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. హోటల్ కట్టాలంటే 15 రకాల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. 30 రోజుల్లో అనుమతులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రెన్యువల్ కూడా ఆటోమాటిక్‌గా జరుగుతుందన్నారు.

అనుమతి ఇవ్వని పక్షంలో 30 రోజుల తర్వాత డీమ్డ్ అప్రూవల్ వస్తుందన్నారు. భవిష్యత్తులో టూరిజం మంచి అభివృద్ధి చెందుతుందన్నారు. రామప్ప లాంటివి వరల్డ్ టూరిజం మ్యాప్ లోకి త్వరలోనే చేరుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని… ప్రాజెక్టు డ్యామ్‌ల వద్ద పర్యాటకం అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు చాలా సులభం అయ్యాయని చెప్పారు. డీమ్డ్ అప్రూవల్ ఉంటుందన్నారు. గత ఆరు సంవత్సరాల్లో చాలా కంపెనీలకు అనుమతులు ఇచ్చామన్నారు.

Advertisement

Next Story

Most Viewed