- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గమనిక.. పాన్ కార్డుతో ఆధార్ లింక్ తప్పనిసరి.. లేదంటే జరిమానా..!
దిశ, బెల్లంపల్లి : మార్చి 31వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో పలు అంశాలను అప్‌డేట్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ గడువు ముగియనుంది. ఇక తాజాగా పాన్ కార్డును మీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు చివరి తేదీ ఈ ఏడాది మార్చి 31.
అయితే అప్పటికీ అనుసంధానం చేయకపోతే ఈనెలాఖరులోగా చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ బ్యాంకు లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. అప్పుడు మనమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్చి 31వ తేదీలోగా ఈ పని చేయకపోతే రూ.10వేల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సిందిగా సూచిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గత ఏడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిని చివరి తేదీగా మార్చి 31, 2021 నిర్ణయించింది. ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించక పోయినట్లయితే ఏప్రిల్ 1, 2021 నుంచి ఆ పాన్ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రూ. 10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆర్ధిక లావాదేవీలలో పాన్ కార్డు ఆవశ్యకత ఎంతో ముఖ్యం..
పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో చాలా కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి అవసరం. పాన్ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. పాన్, ఆధార్‌లను లింక్ చేయడం సులభమే. ఇన్‌కంట్యాక్స్ ఇఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటిపి (వన్ టైం పాస్ వర్డ్ )ని ఎంటర్ చేస్తే చాలు మీ పాన్‌కార్డు, ఆధార్ కార్డు లింకైపోయినట్లే.
అనుసంధానించేందుకు మొబైల్ తోనూ చేసుకోవచ్చు ..
పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు మొబైల్‌తో ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంది. మొబైల్ నెంబర్ నుంచి UIDAIPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబరు, స్పేస్ ఇచ్చి, పాన్ నెంబరును 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం ద్వారా పంపించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆధార్, పాన్ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. కాగా ఇప్పటికే మీరు రెండింటిని జత చేసుకున్నా మరోసారి ఇఫైలింగ్ వెబ్‌సైట్‌లకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.