- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లింక్ డిన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ లింక్‌డిన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును అందిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రభావం ఇంకా కొనసాగుతున్న కారణంగా టెక్ కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు లింక్‌డిన్ కూడా తమ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగులు తమకు అనుకూలమైన పని అవకాశాన్ని ఎంచుకునేలా అవకాశాన్ని ఇవ్వనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా అవకాశాన్ని బట్టి పార్ట్‌టైమ్ కార్యాలయానికి వచ్చే వెసులుబాటును కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లింక్‌డిన్ సంస్థలో మొత్తం 16 వేల మంది ఉద్యోగులు ఉండగా, వారందరికీ ఈ అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో కొన్ని పనులు కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించవలసి ఉంటుందని, అటువంటి బాధ్యతలను నిర్వహించే వారు మాత్రమే ఖచ్చితంగా ఆఫీసుకు రావాల్సి ఉంటుందని సంస్థ యాజమాన్యం పేర్కొంది. అయితే, తాజా నిబంధనలను అనుసరించి ఉద్యోగులు నివాసాన్ని మారిస్తే ఆ ప్రాంతానికి తగినట్టుగా వేతనాల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.