- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగర్ కర్నూల్‌లో మరో లంచగొండి
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో నాగరాజు వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే నాగర్ కర్నూల్ జిల్లాలో మరో అవినీతి తహసీల్దార్ వ్యవహారం కలకలం రేపింది. ఏసీబీ అధికారులు ఎప్పటికప్పటికీ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఇంకా మార్పు రాకపోవడం గమనార్హం.
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలానికి చెందిన రైతు కొండలు తాను సాగుచేసుకుంటున్న 6 ఎకరాల భూమిని తన పేరు మీదుగా పట్టా చేయించాలని లింగాల ఎమ్మార్వో మళ్లిఖార్జున్ ను ఆశ్రయించాడు. అయితే, ఇదే అదునుగా చేసుకున్న ఎమ్మార్వో రూ. లక్షా 50 వేలు లంచం అడిగాడు. దీంతో బాధిత రైతు రూ. 50 వేలను అడ్వాన్స్ గా ఇచ్చాడు.
ఆ తర్వాత అదే భూమిని చూపి వేరే రైతు వద్ద ఎక్కువ డబ్బులకు కక్కుర్తి పడ్డ ఎమ్మార్వో మళ్లీఖార్జున్.. తనకు చెందకుండా చూస్తున్నాడని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను సాగు చేస్తున్న భూమిని వేరే వాళ్లకు ఎలా ఇస్తారని తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మార్వో కారుకు అడ్డుపడి నిలదీస్తే.. అతడిని ఈడ్చుకుంటూ కారు పోనిచ్చాడని బాధితుడు వాపోయాడు. ఆ తర్వాత తానిచ్చిన లంచంలో రూ. 40 వేలను తిరిగిచ్చి.. మిగతా 10 వేలు ఖర్చు చేశానని చెబుతున్నాడని వాపోయాడు. ఆ భూమి పట్టా వేరే వాళ్ల పేరు మీద అయిందని చెప్పడంతో ఆందోళనకు దిగానని బాధిత రైతు వివరణ ఇచ్చాడు.