గుడ్‌న్యూస్.. శ్రీశైలం గేట్లు ఎత్తివేత

by Shyam |
గుడ్‌న్యూస్.. శ్రీశైలం గేట్లు ఎత్తివేత
X

దిశ, అచ్చంపేట: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు ముందు తెలిపిన విధంగానే బుధవారం సాయంత్రం 7.20 నిమిషాలకు ప్రాజెక్టు 2 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 885 అడుగులు ఉండగా 215.807 మీటర్ల సామర్థ్యం ఉన్నది. బుధవారం సాయంత్రం 7.20 నిముషాలకు ప్రాజెక్టులోకి 882 . 10 అడుగులు చేరుకోగా 268.875 మీటర్ల సామర్థ్యానికి వరద వచ్చి చేరడంతో 2 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి 53, 488 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వదిలారు. అలాగే శ్రీశైలం ఎడమగట్టు తెలంగాణ విద్యుత్ కేంద్రం ద్వారా 35, 315 నీటిని, అలాగే కుడిగట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కేంద్రం ద్వారా 31,356 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed