శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

దిశ, బాల్కొండ: మహారాష్ట్రలో కురుస్తున భారీ వర్షాలకు.. దిగువ ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు‌కి ఇన్ ఫ్లో 50,225 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో.. 8 గేట్లు ఎత్తి కాలువలు, వరద గేట్లు నుండి 50,225 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ద్వారా దిగువకు వదిలారు.

మంగళవారం ఉదయానికి మరో 24,669 వేల క్యూసెక్కుల నీటి ఉద్రిక్త పెరగడం, మొత్తం 74,894 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో మరో 8 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 ఫీట్లు (90.31 టీఎంసీలు) కాగా.. మంగళవారం ఉదయం వరకు 1091.00 ఫీట్లు (90.31 టీఎంసీలు)ల పూర్తి స్థాయికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement