ఫుడ్ డెలివరీ చేస్తూ ఆ పని చేస్తున్న జోమాటో బాయ్.. వీడియో చూశారంటే ఔరా అనాల్సిందే..

by Sumithra |
ఫుడ్ డెలివరీ చేస్తూ ఆ పని చేస్తున్న జోమాటో బాయ్.. వీడియో చూశారంటే ఔరా అనాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం, వారి గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాము. వారి కష్టాలను చూసి, వారు ఎదిగిన తీరును చూసి రోల్ మోడల్ గా భావిస్తాం. అయితే ప్రతిసారీ గొప్ప వ్యక్తులనే రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కొన్ని సార్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులనే మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వారు మనలో ఉన్న బద్దకాన్ని పోగొట్టి మనం పట్టదలతో ఏదైనా సాధించగలం అనే ప్రేరణను కలిగిస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో ఓ జొమాటో రైడర్ చాలామంది యువతకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఆ యువకుడు బైక్ నడుపుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితంలో పోరాటం చాలా ముఖ్యం. మీ పోరాటమే మిమ్మల్ని విజయవంతమైన మనిషిని చేస్తుంది. అందుకే ఓ జొమాటో రైడర్ తాను జీవితంలో విజయం సాధించాలని ఒకే సమయంలో తన ఉద్యోగ బాధత్యలు నిర్వర్తిస్తూ మరోవైపున కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జోమాటో రైడర్ తన క్లాసెస్ ని క్రమం తప్పకుండా హాజరవుతున్నట్లు మీరు చూడవచ్చు. అతని చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా అతను ఏకాగ్రతగా ప్రిపేర్ అవ్వడం నిజంగా ప్రశంసనీయం. ఈ క్లిప్ చూస్తుంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లు అర్థమవుతోంది.

ఈ వీడియో @ayusshsanghi అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం అయ్యింది. ఈ వీడియోని చూసిన వారిలో కొంతమంది కొన్ని కామెంట్లను జోడించారు. అందులో ఓ వ్యక్తి 'కష్టపడి చదవడానికి వేరే ప్రేరణ అవసరం లేదు' అని రాశారు.

Advertisement

Next Story

Most Viewed