- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఆహార పదార్ధాలతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చు
దిశ, ఫీచర్స్: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతి నుంచి దొరికే అన్ని ఆహారాలను మనం తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మారుతున్న జీవనశైలి అలవాట్ల కారణంగా ఇటీవల ఎక్కువ మంది అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. వాటిలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ సమస్యను తగ్గించడానికి, మందులు,ప్రొడెక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినా కూడా ప్రయోజనం ఉండటం లేదు. ప్రతిరోజూ మార్కెట్ లో లభించే వివిధ రకాల కూరగాయలను తీసుకుంటే చాలా తేలికగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇక్కడ చూద్దాం..
పాలకూర: పాలకూరలో ఐరన్, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
మెంతులు: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బెండకాయ: ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
టొమాటోలు: లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
Read More..
ఈ సీక్రెట్స్ పంచుకుంటే జీవితం నాశనం అయినట్లే.. తర్వాత మీ ఇష్టం