చెట్ల కౌగిలింతకు అలవాటుపడిపోయిన మహిళ.. హార్మోన్స్ విడుదలై ఆ అనుభూతి కలుగుతుందంటూ..

by sudharani |
చెట్ల కౌగిలింతకు అలవాటుపడిపోయిన మహిళ.. హార్మోన్స్ విడుదలై ఆ అనుభూతి కలుగుతుందంటూ..
X

దిశ, ఫీచర్స్: చెట్లను కౌగిలించుకోవడం వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను ప్రచారం చేస్తూ పాపులర్ అయిపోయింది షాంఘై మహిళ క్విషిషికి. ఏప్రిల్‌లో తన భర్తతో బయటకు వెళ్లినప్పుడు వీధిలో ఉన్న ఓ చెట్టును మొదటిసారి కౌగిలించుకుంది. దీంతో మ్యాజికల్‌గా పని సంబంధిత ఒత్తిడి అదృశ్యమైందని తెలిపింది. ఈ అద్భుతమైన తొలి అనుభవం ఆమెను ఇతర చెట్లను హగ్ చేసుకునేందుకు, ఈ కథను ఇతరులకు షేర్ చేసేందుకు ప్రేరేపించింది.

షాంఘై సమీపంలోని ఫారెస్ట్ పార్క్‌లో వెయ్యి సంవత్సరాల నాటి చెట్టును ఆలింగనం చేసుకున్న తర్వాత తాను రిలాక్స్‌ అయ్యానని, స్వస్థత పొందానని, చెట్టు తనను కౌగిలించుకున్నట్లు అనిపించిందని తన ఇన్‌స్టా పేజ్‌లో తెలిపింది క్విషిషికి. తాను ఇన్నాళ్లుగా మోస్తున్న అన్ని భారాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడిందని చెప్పింది. ఇతర మనుషులను కౌగిలించుకుంటే భయాందోళన దూరం కాలేదని, తన ప్రతికూల శక్తిని వారు భరించలేకపోయారని తెలిపింది.

కానీ చెట్లు చాలా భిన్నంగా ఉంటాయని.. అవి నిశ్శబ్దంగా, ఓపికగా తమ మాట వింటాయని వివరించింది. ట్రీ-హగ్గింగ్‌తో డాక్టర్ ట్రీట్మెంట్‌ను రీప్లేస్ చేయమని తాను సలహా ఇవ్వట్లేదన్న ఆమె.. అయితే చెట్ల ఆలింగనం భావోద్వేగాలను సర్దుబాటు చేయడంలో సహాయపడుతుందని చెప్పింది. ఇక ‘ది హగ్ డాక్టర్’ అని పిలవబడే క్లినికల్ సైకాలజిస్ట్ స్టోన్ క్రౌషర్ ప్రకారం.. 21 సెకన్ల పాటు ఒకరినొకరు కౌగిలించుకుంటే ఆక్సిటోసిన్ విడుదల పెరిగి ప్రయోజనం పొందుతారని, ట్రీ-హగ్గింగ్‌కు కూడా ఇది వర్తిస్తుందని చెప్తున్నారు.

Advertisement

Next Story