- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ హ్యాక్ అయిందా.. లేదా ? ఈ సిగ్నల్స్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు !
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలా సోషల్ మీడియా అకౌంట్స్‌ని హ్యాక్ చేసినట్టుగానే కొంతమంది సైబర్ క్రిమినల్స్ మొబైల్స్‌ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. అలా హ్యాక్ చేసిన ఫోన్‌లో ఉన్న మొత్తం డేటా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక వివరాలను ఈజీగా తెలుసుకుంటారు. అంతే కాదు బ్యాంక్ డీటేల్స్‌ని తెలుసుకుని ఆర్థికంగా దెబ్బ కొడతారు. మొబైల్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు కలెక్ట్ చేసి వాటిని మార్ఫింగ్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. మరి అలాంటి హ్యాకర్ల నుంచి ఎలా తప్పించుకోవాలి, మొబైల్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు దాని పనితీరును ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి. మనం వాడే ఫోన్ బ్యాటరీ త్వరత్వరగా చార్జింగ్ అయిపోతూ ఉంటే ఫోన్ హ్యాక్ అవుతుందనడానికి సంకేతం. మొబైల్‌ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్లు యాప్‌లు, మాల్వేర్, డేటాను ప్రాసెస్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. అంతేకాదు అప్పటి వరకు ఫాస్ట్‌గా పనిచేస్తున్న ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం మొదలు పెడితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్‌లో ఉన్నకొన్ని ప్రోగ్రామ్స్ డివైస్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసి ఫోన్ స్లో అయ్యేలా చేస్తుంది. మొబైల్‌లో డేటా కూడా త్వరత్వరగా అయిపోతూ ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉన్నప్పటికీ నెట్ ని వినియోగించడంతో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఫోన్ ఎప్పటికప్పుడు ఆఫ్ అవుతూ దానంతట అదే రీస్టార్ట్ అవుతున్నా, ఫోన్‌లో యాప్‌లు, సెట్టింగ్స్ దానంతట అవే మారుతున్నా మొబైల్ హ్యాకర్ ఆధీనంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఫోన్ వినియోగదారులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయినప్పుడు మొబైల్‌ని ఫార్మాట్ చేయాలి. లేదంటే ఫ్యాక్టరీ రీసెట్ అయినా చేయవచ్చు. అలా చేయడం ద్వారా హ్యాకర్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.