- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హనీమూన్‌కు ముందే ఆ పని చేయండి.. ఆ విషయంలో ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది..

దిశ, ఫీచర్స్ : మీరు మీ లైఫ్ పార్ట్‌నర్‌ను ఫిక్స్ అయ్యారా? వారితోనే ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారా? అయితే ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన రావాలంటే.. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లే బదులు మ్యారేజ్‌కు ముందే ఓ ట్రిప్ ప్లాన్ చేస్తే వారి పాజిటివ్స్, నెగెటివ్స్ తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. మీకు సదరు వ్యక్తి నిజంగా బెటర్ హాఫ్ అవుతారో లేదో నిర్ణయించుకోవచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఒక వ్యక్తి గురించి ఓ ట్రిప్‌లోనే ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం.
* ఒకరితో ప్రయాణించడం వారి గురించి తెలుసుకోవడానికి అద్భుతమైన మార్గం. ముఖ్యంగా మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే బెస్ట్ ఆప్షన్. అప్పుడప్పుడు డేట్స్‌లో లేదా కాల్స్ ద్వారా కమ్యూనికేట్ కావడం కంటే కూడా జర్నీలో రియల్ పర్సనాలిటీ చూసే చాన్స్ ఉంది. ఉదాహరణకు హోటల్ బుకింగ్ రద్దు లేదా కారు టైర్ ట్రబుల్ ఇవ్వడం వంటి విషయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తెలుసుకునే అవకాశం రెట్టింపు ఉంటుంది. మంచి అనే మాస్క్ వేసుకుని మీ ముందు యాక్ట్ చేసినా.. ఇలాంటి సమయాల్లో అసలు విషయం బయటపడుతుంది.
* ఆసక్తులు, అలవాట్లు, సమస్య పరిష్కారం, ఖర్చు అలవాట్లు, ఓర్పు, సర్దుబాటు, సాన్నిహిత్యం వరకు అన్నీ తెలుసుకుంటారు. ఈ పద్ధతి మీరు మీ రిలేషన్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాలా లేదా నిర్ణయించుకునేందుకు హెల్ప్ అవుతుంది.
* కాబోయే భాగస్వామితో ప్రయాణించడం అనేది రోజువారీ జీవితంలో బయటపడని విధంగా ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవడానికి ఒక విలువైన అవకాశం. ఇది సంబంధంలోని వివిధ అంశాలను పరీక్షిస్తుంది. బలపరుస్తుంది. భవిష్యత్తుకు బలమైన పునాదిని అందిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఎలా కమ్యూనికేట్ చేస్తారో, చర్చలు జరుపుతారో, మీతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాదు జర్నీలో కలిసి ఉండటం వల్ల ఒకరి ఇష్టాలు, అయిష్టాలు, కంఫర్ట్ జోన్‌లు, విలువలు, నమ్మకాలు, ఇతర అంశాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
* మీ భాగస్వామి బీచ్ హాలిడేస్ కోరుకుంటే.. మీరు బీచ్‌లను ద్వేషిస్తే.. ఆ పరిస్థితిలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే దాని గురించి ఒక ఐడియా వస్తుంది. మీకు కళలపై ఆసక్తి ఉంటే, వారు మీతో మ్యూజియంకు వస్తారా లేదా కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఒక వ్యక్తిని అంచనా వేసేందుకు.. మీకు సెట్ అవుతారా లేదా తెలుసుకోవడానికి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు సాగడం ఈజీ అవుతుంది.