- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రైన్ టికెట్ల మీద GNWL50, WL6 వంటి నెంబర్లు ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏమిటి?
దిశ, ఫీచర్స్ : ఎక్కడికైనా సుదూర ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చాలామంది ట్రైన్ టెకెట్ ముందుగానే బుక్ చేసుకుంటారు. ఒకవేళ టికెట్ కన్ఫామ్ కాకపోతే వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. చాలా మంది పెద్దగా పట్టించుకోరు కానీ అప్పుడా టికెట్ పైన GNWL50/WL6 వంటి ఏవైనా నెంబర్స్ వస్తుంటాయి. అసలు వీటి అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా?
వాస్తవానికి GNWL.. అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. ఇక దాని పక్కన ఉండే నెంబర్ అనేది మీకంటే ముందు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఎంతమందికి అందాయి అనే సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడే మరో విషయం గుర్తుంచుకోవాలి. మీతోపాటుగా టికెట్ బుక్ చేసుకొని కన్ఫామ్ అయిన వారిలో ఎవరైనా తమ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీ వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ మారుతుంది. ఉదాహరణకు GNWL50/WL6 అని మీ టికెట్‌పై ఉంటే గనుక ఈ వెయిటింగ్ లిస్ట్ జాబితాలో టికెట్లు బుక్ చేస్తే అందులో 34 మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారని అర్థం. అంటే ఇప్పుడు వెయిటింగ్ లిస్టులో మీకంటే ముందు 16 మంది మాత్రమే ఉన్నారని అర్థం.