- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాయింట్ ఎకౌంట్ ఉన్న దంపతుల మధ్యే ప్రేమ ఎక్కువ..
దిశ, ఫీచర్స్: డబ్బు ప్రేమను కొనగలదా? అంటే లవ్, మ్యారేజ్‌ను ఎక్కువ కాలం నిలబెట్టగలదని స్పష్టంగా చెప్తున్నారు ఇండియానా యూనివర్సిటీ కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు. ఆర్థిక వ్యవహారాలను కలిసి నిర్వహించే వివాహిత జంటలు ఎక్కువ కాలం ఒకరినొకరు ప్రేమిస్తారని గుర్తించారు. అందుకే ఆర్థిక బాధ్యత, ఆనందం మధ్య పరస్పర సంబంధాన్ని గురించి తెలిపిన ఈ తాజా అధ్యయనం ఇంతకు ముందు కపుల్స్‌పై జరిగిన అధ్యయనాలతో పోలిస్తే ముఖ్యమైనదని అంటున్నారు నిపుణులు.
రెండేళ్లు పలు వివాహిత జంటలపై స్టడీ చేసిన పరిశోధకులు.. జాయింట్ బ్యాంక్ ఎకౌంట్ కలిగిన భార్యాభర్తల బంధాన్ని, వేర్వేరు బ్యాంక్ ఖాతాలు కలిగిన దంపతులతో పోల్చారు. జాయింట్ ఎకౌంట్ కలిగిన వారు మెరుగైన సంబంధాలను కలిగి ఉండటమే కాదు డబ్బు విషయంలో తక్కువ గొడవలు పడ్డారని, ఇంటి ఆర్థిక వ్యవహారాల విషయంలో మంచి అనుభూతితో ఉంటున్నారని కనుగొన్నారు. దీంతో వేసే ప్రతీ అడుగులో కలిసి ఉన్నట్లుగానే భావిస్తున్నామని చెప్పారని.. ఈ ఎవిడెన్స్‌ను వినియోగించి కపుల్స్ ఫ్యూచర్‌ను తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. ఎకౌంట్ మెర్జింగ్ అనేది పార్ట్‌నర్‌తో కన్వర్జేషన్, కమ్యూనికేషన్‌కు కారణం అవుతుందని.. తద్వారా బంధం బలపడుతుందని చెప్తున్నారు.
Also Read:
స్పైడర్ కాటేస్తే పురుషుల్లో అంగస్తంభన