Snake: పాము కాటేస్తే మనిషి ఎందుకు చనిపోతాడు.. సైన్స్ ఏం చెబుతుందంటే..?

by Prasanna |   ( Updated:2024-09-21 06:10:00.0  )
 Snake: పాము కాటేస్తే  మనిషి ఎందుకు చనిపోతాడు.. సైన్స్ ఏం చెబుతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనలో చాలా మంది పాములు చూడగానే భయపడి పారిపోతుంటారు. మరి కొందరైతే చూసిన వెంటనే వణికిపోతుంటారు. అయితే చూసిన పాములన్ని విష పూరితం కావు. కానీ, విషం కక్కే పాములు కాటేస్తే మాత్రం బతుకుతారని గ్యారంటీ లేదు. సమయానికి చికిత్స తీసుకోకపోతే వ్యక్తి చనిపోయే అవకాశాలు ఉంటాయి. వాటిలో, విషపూరితమైన కోబ్రా వంటి పాములు కాటేస్తే ఇక భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే..! అయితే, అసలు పాము కాటేసిన సమయంలో మనిషి శరీరంలో ఏం జరుగుతుంది? పాము కాటు వేయగానే మనిషి ఎందుకు వెంటనే చనిపోతున్నారన్న సందేహం చాలా మందికి సందేహం ఉంది. విషం మనిషి శరీరంలో ప్రవేశించిన వెంటనే ఎలాంటి మార్పులు వస్తాయి..అలాగే సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పాము కాటు వెనుక సైన్స్ నమ్మలేని నిజాలు బయట పెట్టింది. మనిషిని కాటేసిన వెంటనే విషం రక్తంలోకి చేరుతుంది. దీంతో సెకన్ల వ్యవధిలోనే రక్తం ఎక్కడకక్కడ గడ్డ కడుతుంది. విషపూరితమైన పాములు కాటేయడం వలన ఇది మరింత వేగంగా జరుగుతుంది. రక్తం గడ్డకట్టడం మొదలవ్వగానే గుండెకు రక్తసరఫరా ఆగిపోతుంది. ఆ తర్వాత శరీంలోని అవయవాలకు ఆక్సిజన్‌ అందడం ఆగిపోతుంది. అందుకే పాము కాటేసిన మనిషి శరీరం నీలం రంగులోకి మారిపోతుందని నిపుణులు వెల్లడించారు.

పాము కాటేసిన వెంటనే ఆ ప్రదేశం వద్ద సబ్బు నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఆ భాగాన్ని వీలైనంత గట్టిగా నొక్కి విషాన్ని బయటకు తీయాలి. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ కి వెళ్లి CTBT పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ పాము విషపూరితమైనది కాకపోతే పాము టీటీ ఇంజక్షన్‌ వేపించుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story