- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీబోర్డ్‌లో కీస్ ఎందుకు ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఉండవు?
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్‌ని వాడుతుంటారు. అందులో కీ బోర్డ్ అనేది ముఖ్యమైనది. ఇది లేకుండా కంప్యూటర్‌లో ఏ పని జరగదు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా కీబోర్డ్‌లో ఇంగ్లీష్ అక్షరాలు ఎందుకు ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఉండవు అని. స్మాట్ ఫోన్‌లో కూడా ఈ అక్షరాలు గజిబిజిగానే ఉంటాయి. అసలు ఎందుకు ఈ కీస్ ఇలా ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎందుకు ఉండవు? అనే ఆలోచన మీకు వచ్చినట్లైతే దీని గురించి తెలుసుకోండి.
ముందుగా మనకు కీబోర్డ్‌ల కంటే ముందు టైప్‌రైటర్లు ఉండేవి. ఈ టైప్‌రైటర్‌ను మొదటిసారిగా 1575లో తయారు చేశారు. అందులో కొన్ని కీస్ మాత్రమే ఉండేవి. ఆ తరువాత 1714లో పూర్తిగా ఇంగ్లీష్ అక్షరాలతో టైప్‌రైటర్‌ను తయారు చేశారు. అయితే అందులో కీస్ ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఉండేవట. వీటి తరువాత మోడర్న్ టైప్‌రైటర్‌ను 1829లో అమెరికాకు చెందిన విలియం ఆస్టిన్ బర్డ్ తయారు చేయగా.. 1868లో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ తొలి కమర్షియల్ టైప్‌రైటర్‌ను రూపొందించారు.
అందులో కీస్ A,E,I,Y,U,O గా ఉండేవి. అయితే ఈ కీబోర్డ్ లేఅవుట్‌ని ఎన్నిసార్లు మార్చినా టైప్‌రైటర్లు టైపింగ్ చేయడానికి ఇబ్బందులు పడేవారు. దీనిపై అనేక పరిశోధనలు జరిపిన తరువాత చివరిగా క్వర్టీ కీబోర్డ్‌ను తయారు చేశారు. ఈ క్వర్టీ కీబోర్డ్‌లో లేటర్స్ Q,W,E,R,T,Y,U,I,O,P, గా ఉండేవి. అంటే ప్రస్తుతం మనం వాడుతున్నకీబోర్డ్. ఈ క్వర్టీ లేఅవుట్‌ను లాథమ్ షోల్స్ 12000 డాలర్లకు రెమింగ్టన్ ఆర్మ్స్ కంపెనీ అమ్మినట్లు చరిత్ర చెబుతోంది.
అయితే ఈ టైప్‌రైటర్ కొన్ని రోజుల్లోనే 40,000 పైగా అమ్మకాలు జరిగాయి. అప్పర్ కేస్, లోయర్ కేస్‌తో అప్పుడే తొలి టైప్‌రైటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో సులువుగా ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ క్వర్టీ కీబోర్డ్‌నే ఫాలో అయ్యేవి. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఈ క్వర్టీ కీబోర్డ్‌ను ఎవ్వరూ మార్చలేకపోయారు. అయితే దీనిని ఆధారంగా చేసుకోనే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ కీబోర్డ్‌ను ఉపయోగించారు.