- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే చేపల్ని తినండి !
దిశ, ఫీచర్స్: మీకీ విషయం తెలుసా.. తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తడమో, దూరం కావడమో జరుగుతాయి. ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఒక్కో విధమైన ప్రయోజనం చేకూర్చుతుంది. అలాగే చేపలు కూడా. వారానికి మూడుసార్లు ఫిష్ కర్రీ తినేవారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రావని, కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. అందుకే రోజువారీ ఆహారంలో చేపలను చేర్చడం మంచిదని చెప్తున్నారు.
ఎందుకంటే వీటిల్లో శరీర ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హార్ట్ హెల్తీగా ఉండేలా చేస్తాయని ఆహార నిపుణుల అధ్యయనంలో తేలింది. తరచూ చేపలను ఆహారంలో చేర్చడం ద్వారా కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు, 'జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్' వారితో కలిసి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 12 దేశాలకు దాదాపు 26 వేల మంది పరిశీలకులు అనేక సార్లు అధ్యయనం చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారని నిపుణులు పేర్కొంటున్నారు.
చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలతోపాటు విటమిన్ డీ కూడా లభిస్తుంది. ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్, ట్రౌట్, టూనా, స్వోర్డ్‌ఫిష్, మాకరెల్, సార్డైన్స్, హెర్రింగ్ వంటి చేపలను తినడం ద్వారా చాలా మేలు జరుగుతుందట. అంతేగాక వీటిలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎన్-3 పీయూఎఫ్‌ఏ) గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు చెక్ పెడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.