- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముఖంపై తెల్లటి మొటిమలా? అయితే అవి మిలియా కురుపులు కావచ్చు !
దిశ, ఫీచర్స్ : ముఖంపై లేదా వీపుపై తెల్లటి మొనదేలిన మొటిమలు(కురుపులు) కొందరిని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇవి దురద స్వభావాన్ని కలిగి ఉంటాయి. తరచూ గోకడంవల్ల నొప్పి కలుగుతూ ఉంటుంది. ఇవి మొటిమల్లాగా కనిపిస్తాయి కానీ నిజానికి మొటిమలు కావు. వీటిని మిలియా కురుపులు అంటారని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో కెరాటిన్ అనే ప్రోటీన్ చర్మ కణజాలంలో మార్పులవల్ల ఒక్కోసారి అదుపుత తప్పుతుంది. అది చర్మానికి ఉపరితలంలో నిలిచిపోయినప్పుడు మిలియా కురుపులుగా బయటకు కనిపిస్తాయి. జుట్టు, గోళ్ల భాగంలోని కణాలలో కూడా కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.
నల్లటి మచ్చలుగా మారుతాయి
మిలియా కురుపులు ముఖంపై నెలల తరబడి తగ్గకుండా ఉంటాయి. దురదగా అని పించినప్పుడు వీటిని చేతిగోళ్లతో తాకడం లేదా గిచ్చడంవల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కురుపులు తగ్గినప్పటికీ నల్లటి మచ్చలు ఏర్పడి అలాగే ఉంటాయి. కాబట్టి తరచూ గోళ్లతో తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మిలియా కురుపులు లేదా తెల్లటి మొటిమలవల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తుతాయా? అనే సందేహాలు కూడా కొందరిని వెంటాడుతుంటాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లల నుంచి పెద్దల వరకు ఇవి సహజంగా వచ్చి పోతుంటాయని డెర్మటాలజిస్టులు అంటున్నారు.
ఎలా తగ్గుతాయి?
మిలియా కురుపులు సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగులో ఉండే చిన్నపాటి గడ్డలు. దురద స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సమస్య ఉన్నవారు అసౌకర్యానికి గురవుతుంటారు. గరుకుగా ఉండే తవ్వాలుతో తుడిచినప్పుడు మిలియా కురుపులు నొప్పిని కలిగిస్తాయి. పిల్లల్లో, పెద్దల్లో, యుక్త వయస్కుల్లో ఎవరిలోనైనా ఈ మిలియా కురుపులు ఏర్పడవచ్చు. సాధారణంగా ముఖం, పెదవులు, కనురెప్పలు, చెంపలపై కనిపిస్తాయి. మొండెం లేదా జననేంద్రియాలపై కూడా ఏర్పడవచ్చు. ఏవేవో మాయిశ్చరైజ్డ్ క్రీములు వాడటంవల్ల ఇవి తగ్గవు. కొంతకాలం తర్వాత వాటంతట అవే తగ్గడమో, లేదా కొందరిలో చికిత్స తీసుకోవడంవల్ల తగ్గడమో జరుగుతుంది. కాబట్టి మిలియా కురుపులు ఏర్పడితే వైద్యులను సంప్రదించడం బెట్టర్.
ఇవి కూడా చదవండి : యూవీ రేస్‌తో టాటూస్.. ఈ భయానక టాటూలను మీరూ చూడండి!!