Chanakya Niti: ఎప్పుడు మాట్లాడాలి..? ఎక్కడ మౌనంగా ఉండాలి..!

by Phanindra |
Chanakya Niti: ఎప్పుడు మాట్లాడాలి..? ఎక్కడ మౌనంగా ఉండాలి..!
X

దిశ, వెబ్ డెస్క్ : చాణక్య నీతి గురించి ఈ కాలంలో కూడా వింటూనే ఉంటాం. ఇది మనిషిలోని మంచి లక్షణాల గురించే కాకుండా వారి లోపాలను కూడా చెబుతుంది. మనిషి ఎలా మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలనేది మనకి ఎల్లప్పుడూ బోధిస్తుంది. చాణక్య నీతిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి కష్టాన్ని అయినా ఇట్టే ఎదుర్కొవచ్చు. ఎందుకంటే, మనం చేసే పనుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. చాణక్యుడు మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలని సూచించాడు. కొన్ని సార్లు మాట్లాడి అవమాన పడేకన్నా మౌనంగా ఉండటమే చాలా మంచిదని చెబుతున్నాడు. అయితే, ఎక్కడెక్కడ సైలెంట్ గా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త ప్రదేశాలు

కొన్ని సార్లు కొత్త ప్రదేశాలలో మౌనంగా ఉంటే చాలా సమస్యలు దూరమవుతాయి. లేదంటే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేరు. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు మాట్లాడకపోవడమే మంచిది.

గొడవలు జరిగే స్థలం

గొడవలు జరిగేటప్పుడు తిరిగి వారి మీదకు వెళ్లకుండా మౌనంగా ఉండాలి. కొంతమంది దొరికిందే సందు అనుకుని జోక్యం చేసుకుని రెచ్చగొడుతుంటారు. ఇలాంటి సమయంలో చాలా ఓపికగా ఉండాలి. ఎవరైనా వచ్చి అడిగితే తప్పా మీరు మాట్లాడకండి.

ప్రశంసలు

కొందరు వ్యక్తులు వారికీ వారు ఎక్కువగా పొగుడుకుంటారు. అలాంటి టైం లో సైలెంట్ గా ఉండటమే మంచిది. అక్కడ మీరు పొరపాటున మాట్లాడితే మిమ్మల్ని అగౌరపరుస్తారు.

సగం జ్ఞానం

కొందరు సగం జ్ఞానంతో ఎదుటి వాళ్ళ బుర్ర తింటారు. తెలుసు కదా అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరెగిరిపడుతుంది . అలాగే కొంతమందికి జ్ఞానం లేకపోయిన మాట్లాడుతుంటారు. పూర్తి జ్ఞానం ఉన్నవారు ప్రశాంతంగా ఉంటారు.

ఇతరుల సమస్యలు

ఎవరైనా మీకు వారి సమస్యను చెబితే శ్రద్ధగా వినండి. వారి బాధను, ఇబ్బందులను కూడా అర్థం చేసుకోండి. ఆ సమయంలో మీరు మౌనంగా ఉండటం మంచిది. వారికి సహాయం చేయడానికి కూడా ప్రయత్నించండి. కానీ, అనవసరంగా మాట్లాడి మీరు ఇబ్బంది పడి, ఎదుటి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకండి.



Next Story

Most Viewed