'పవర్‌ఫుల్ 'పింక్ మనీ'

by Sathputhe Rajesh |
పవర్‌ఫుల్ పింక్ మనీ
X

దిశ, ఫీచర్స్: 'పింక్ మనీ' పదాన్ని గే, లెస్బియన్ కమ్యూనిటీ కొనుగోలు శక్తిని సూచించేందుకు ఉపయోగిస్తారు. స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమం పెరగడంతో యూఎస్, యూకే వంటి పాశ్చాత్య ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అట్టడుగు మార్కెట్ నుంచి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా, ఆర్థిక వ్యవస్థగా 'పింక్ మనీ' అవతరించింది. నైట్‌క్లబ్స్, దుకాణాలు, రెస్టారెంట్స్, టాక్సీ క్యాబ్‌తో సహా ప్రస్తుతం అనేక వ్యాపారాలు గే కస్టమర్లకు ప్రత్యేక సేవలందించడం ఈ కేటగిరీలోకే వస్తుండగా.. సాంప్రదాయ వ్యాపారాల నుంచి ఎదురైన వివక్షే ఈ తరహా సేవలకు డిమాండ్‌ పెరిగేందుకు కారణమైంది.

'పింక్' అనేది పింక్ ట్రయాంగిల్‌ను సూచిస్తుంది. దీన్ని నాజీ మరణ శిబిరాల్లో స్వలింగ సంపర్కులను గుర్తించేందుకు బ్యాడ్జ్‌గా ఉపయోగించిన తర్వాత LGBT హక్కుల ఉద్యమానికి చిహ్నంగా మారింది. 'గే' హక్కుల ఉద్యమం బలం పుంజుకున్న సమయంలో ఈ చిహ్నాన్ని LGBT కమ్యూనిటీ ఐకాన్‌గా పొందాలని నిర్ణయించుకున్నారు.

ఇండియాలో పింక్ మనీ :

భారతదేశం LGBTQIA+ మైనారిటీని మినహాయించిన సమయంలో ప్రతీ సంవత్సరం 26 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయి ఉండవచ్చని నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ తరఫున ఈ సమస్యను అధ్యయనం చేసిన మసాచుసెట్స్ అమ్‌హెర్ట్స్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లీ బాడ్జెట్.. వివక్షాపూరిత పాలన ఫలితంగా భారతదేశం తన జాతీయోత్పత్తిలో 1.4 శాతం నష్టపోయినట్లు తెలిపాడు.

అయితే, 2018లో సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించిన తర్వాత ఈ పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే LGBT కమ్యూనిటీకి గల విపరీతమైన కొనుగోలు శక్తి నుంచి ప్రయోజనం పొందాలని ఇండియన్ మార్కెట్స్ చూస్తున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక బహుళజాతి సంస్థలు ఇప్పటికే LGBT ఉద్యోగుల చేరిక, మెరుగైన ఆర్థిక పనితీరు మధ్య సంబంధాన్ని గుర్తించాయి. పోటీతత్వ శ్రామిక శక్తిని పెంచేందుకు, వివక్ష తొలగించేందుకు చొరవ తీసుకున్నాయి.

ఇతర దేశాలను శాసిస్తున్న పింక్ మనీ :

1984లో UKలో మొదటిసారి LGBT కమ్యూనిటీ కొనుగోలు శక్తిని వివరించడం ద్వారా 'పింక్ పౌండ్' ప్రాచుర్యం పొందింది. కాగా UKలో(లేదా పింక్ పౌండ్) LGBT జనాభాకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్రతీ సంవత్సరం £6 బిలియన్లుగా అంచనా వేయబడింది.

'పింక్ పౌండ్' అనేది గే పీపుల్‌తో అసోసియేట్ అయిన స్ట్రాంగ్ సేల్స్‌తో ముడిపడి ఉంది. ముఖ్యంగా మడోన్నా, లేడీ గాగా, కైలీ మినోగ్, చెర్ వంటి స్వలింగ సంపర్కుల మ్యూజిక్ రికార్డింగ్స్ విక్రయాలే ఇందుకు ఉదాహరణ కాగా అనేక ప్రముఖ సంస్థలు ఇటీవల పింక్ పౌండ్ సామర్థ్యాన్ని గుర్తించాయి. స్వలింగ సంపర్కులకు నేరుగా తమ ఉత్పత్తులు చేరువ చేసేందుకు గే ప్రముఖుల సోషల్ మీడియా ఎకౌంట్స్, యాడ్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం ప్రారంభించాయి. జూన్ 2006లో జరిగిన పింక్ పౌండ్ కాన్ఫరెన్స్, నవంబర్ 2006లో మార్కెట్ రీసెర్చ్ సొసైటీ నిర్వహించిన సమావేశాలు ఇందుకోసమేనని తెలుస్తోంది.

ఇక యూఎస్ విషయానికొస్తే.. ఇక్కడ పింక్ ఎకానమీ చాలా కాలంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ 'పింక్ డాలర్‌'ను 'డోరతీ డాలర్'గా పిలుస్తుండగా.. యూఎస్ LGBT మార్కెట్ అంచనాల ప్రకారం 2012లో 790 బిలియన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా వేయబడింది. పలు యూఎస్ సంస్థలు నిర్దిష్ట ప్రకటనల ప్రచారాలతో ఈ రంగాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఉదాహరణకు : గే, లెస్బియన్ మార్కెటింగ్‌కు అంకితమైన బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అమెరికన్ ఎయిర్‌లైన్స్ LGBT కమ్యూనిటీ నుంచి వచ్చే ఆదాయం 1994లో 20 మిలియన్ డాలర్ల నుంచి 1999లో 193.5 మిలియన్ డాలర్లకు పెరిగింది.

పింక్ మనీతో రాజకీయ బంధం:

స్వలింగ సంపర్కుల నుంచి వచ్చే 'పింక్ మనీ' ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు పాశ్చాత్య దేశాల్లో రాజకీయ శక్తిగా కూడా అవతరించింది. ఈ కమ్యూనిటీ నుంచి వచ్చే విరాళాలు రాజకీయ ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. క్రియాశీల స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమం ఫలితంగా చాలా మంది వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు పింక్ మనీ శక్తి గురించి తెలుసుకున్నారు. కొంతమంది స్వలింగ సంపర్కులు, లెస్బియన్ జంటలు గణనీయమైన పునర్వినియోగపరచలేని నగదును కలిగి ఉన్నందున వారితో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు.

అయితే సంప్రదాయవాద సమూహాల ఒత్తిడి కారణంగా, పింక్ మనీ రాజకీయాల్లో వివాదాస్పదంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు : 1988 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రెసిడెంట్ అభ్యర్థి మైఖేల్ డుకాకిస్ పింక్ మనీతో తనకు తానుగా డిస్‌అసోసియేట్ అయ్యాడు. అయితే ఇటీవల రాజకీయ ఆమోదం పొందిన పింక్ మనీ.. ముఖ్యంగా డెమొక్రాటిక్ పార్టీకి ఉదారవాద మద్దతు కీలక వనరు కాగా, 2000 సంవత్సరంలో కేవలం DNCకి 5 మిలియన్ డాలర్లు అందించడం విశేషం. బిల్ క్లింటన్, అల్ గోర్, జాన్ ఎడ్వర్డ్స్, బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, హోవార్డ్ డీన్, జాన్ కెర్రీ, జో బిడెన్ స్వలింగ సంపర్కుల ఓటు కోసం చురుగ్గా ప్రచారం చేసిన ప్రధాన పోటీదారుల్లో కొందరు.



Advertisement

Next Story

Most Viewed