- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
virgin pregnancy : శృంగారంతో అవసరం లేకుండానే గర్భం.. వర్జిన్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి..?
దిశ, ఫీచర్స్ : కొత్తగా పెళ్లైన దంపతులు, పెళ్లై ఎన్నో ఏండ్లు గడిచినా పిల్లలు పుట్టని దంపతులు పిల్లల కోసం ఎన్నో రకాలు వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యం చేయించుకుంటారు. ఒక వేళ పిల్లలు పుట్టకుండా ఏదైనా లోపం ఉంటే సరోగసి ద్వారానో, ఐవీఎఫ్ ద్వారానో పిల్లలని కంటారు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పిల్లల పుట్టుక గురించిన ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా అదే వర్జిన్ ప్రెగ్నెన్సీ. వింటుంటే కాస్త వింతగా ఉంది కదా. ఇంతకీ ఈ వర్జిన్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి, ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక స్త్రీ గర్భవతి కావాలంటే కచ్చితంగా పురుషునితో కలిసిన తరువాతే గర్భం దాలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది. దీంతో అసాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు. అలాగే వర్జిన్ ప్రెగ్నెన్సీలో ఒక మహిళ తన భాగస్వామితో శృంగారం చేయకుండానే గర్భవతి అవొచ్చంటున్నారు నిపుణులు.
కొన్ని సర్వేల అనంతరం వెలువడిన నివేదిక ప్రకారం వర్జిన్ ప్రెగ్నెన్సీని 7870 మంది మహిళల్లో 0.5 శాతం మంది మాత్రమే అంగీకరించారని తెలిపాయి. అమెరికాలో 200 మంది మాతృమూర్తుల్లో ఒకరు మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవుతారని చెబుతున్నారు.
వర్జిన్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే స్త్రీల అండం రిలీజ్ అయ్యే సమయంలో ఆడవారి ప్రైవేట్ భాగాలలోకి స్పెర్మ్ కణాలు ఉన్న ద్రవాన్ని చొప్పించాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ సాయంతో గర్భాశయంలోకి పంపిస్తారని చెబుతున్నారు. అప్పుడు అండం కణాలు, స్పెర్మ్ కణాలు కలిసి అండం ఫలదీకరణం చెంది ఏకకణ జీవి ఏర్పడుందని చెబుతున్నారు. ఆ తర్వాత జైగోట్ పిండంగా మారుతుందట. జైగోట్‌లో DNA తండ్రి నుంచి సగం, తల్లి నుండి సగం ఉంటుంది. పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 40 రోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పద్దతిలో మలేషియాలో ఉండే ఓ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే 2021వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో నివసించే నికోల్ మూర్ అనే ఓ మహిళ కూడా బిడ్డను కన్నారు. దీంతో ఆమెకు వర్జిన్ మేరీ అని పేరొచ్చింది. అయితే ఈ పద్దతి పై వైద్యనిపుణులు భిన్నంగా తమ అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.