కాళ్లు అలా ముడుచుకుని పడుకుంటే ఏం జరుగుతుంది?

by Javid Pasha |
కాళ్లు అలా ముడుచుకుని పడుకుంటే ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట హాయిగా పడుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే పడుకునే భంగిమ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు వెల్లకిలా పడుకుంటే.. మరికొందరు బోర్లా పడుకుంటారు. కొందరు నిటారుగా పడుకుంటే.. ఇంకొందరు కాళ్లు ముడుచుకొని పడుకుంటారు. అయితే ఎలా పడుకోవడం మంచిది? ఏ భంగిమలో ప్రశాంతంగా ఉంటుందనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే ఎవరు, ఎలా పడుకుంటే ఎటువంటి బెనిఫిట్స్, అలాగే నష్టం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

* అన్ని విషయాల్లో మాదిరిగానే నిద్ర విషయంలోనూ గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీరు బోర్లా, వెల్లకిలా పడుకోవద్దు అంటారు పెద్దలు, నిపుణులు. రాత్రిపూట పడుకునే సమయంలో కాళ్లను కాస్త ఎడమవైపునకు ముడుచుకొని పడుకోవడంవల్ల వీరికి కంఫర్ట్‌గా ఉండటంతో పాటు నిద్రబాగా పడుతుందట. అలాగే ఈ భంగిమలో పడుకోవడంవల్ల కడుపులో బిడ్డ బరువుగా అనిపంచకుండా ఉంటుంది.

* సాధారణ వ్యక్తులు అంటే ఆరోగ్య సమస్య లేనివారు, గర్భిణులు రాత్రిపూట కాళ్లు ముడుచుకొని పడుకోవడం అంత మంచిది కాదు. ఇది వారి బాడీ పొజిషన్‌పై చెడు ప్రభావం చూపుతుంది. కొంతకాలం కాబట్టి సరైన భంగిమలో పడుకోవాలి. గర్భిణులు కూడా ప్రసవం తర్వాత కాళ్లు ముడుచుకొని పడుకునే అలవాటును మానుకోవాలి.

* రాత్రిపూట ఎక్కువసేపు కాళ్లు ముడుచుకొని పడుకోవడంవల్ల నడము నొప్పి, బిగుసుకుపోయిన ఫీలింగ్ కలుగుతాయి. నడుము కింది భాగంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. వెన్ను నొప్పి త్వరగా వస్తుంది. అలాగే కాళ్లల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల తిమ్మిరి వచ్చే చాన్స్ ఉంటుంది. ఉదయంపూట లేవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాత్రిపూట నిద్రకు సరైన మార్గం ఏంటంటే.. నడుము భాగం మంచానికి నేలపై పడుకుంటే నేలకు ఆనించి పడుకునే భంగిమే మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా పడుకున్నప్పుడు తర్వాత కాస్త ఎడమవైపునకు తిరిగి పడుకోవడంవల్ల కూడా మేలు జరుగుతుంది. అయితే ఎక్కువసేపు ఒకే వైపునకు తిరిగి మాత్రం పడుకోవద్దు. బాడీకి బ్యాలెన్స్ ముఖ్యం.

Advertisement

Next Story

Most Viewed