- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురక పెట్టేవారికి హెచ్చరిక.. బిగ్గర శబ్దాలతో బ్రెయిన్ ఎఫెక్ట్
దిశ, ఫీచర్స్: గురక.. మెదడు పనితీరును దెబ్బతీస్తుందని తెలిపారు కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు. స్లీప్ అప్నియా అభిజ్ఞా క్షీణతకు కారణమవుతుందని నిరూపించిన తొలి పరిశోధన తమదేనని పేర్కొన్నారు. బ్రెయిన్ పవర్‌లో తగ్గుదల.. నిర్ణయం తీసుకోవడం, రియాక్టింగ్ టైమ్, అవగాహన వంటి ఆలోచనా నైపుణ్యాలను ప్రభావితం చేస్తుందని వివరించారు. 35 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల పురుషులపై చేసిన ప్రయోగంలో ఈ విషయంపై నిర్దారణకు రాగా.. తేలికపాటి నుంచి తీవ్రమైన OSA(గురక)తో ఉన్న ఏడుగురు ఆరోగ్యవంతులు, 20 మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఇందులో పాల్గొన్నారు.
వీరు నిద్రిస్తున్నప్పుడు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ స్కల్ క్యాప్స్ ధరించమని కోరిన పరిశోధకులు.. తద్వారా మెదడు తరంగాలను కొలిచారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, హృదయ స్పందన రేటు, శ్వాస, కళ్లు, కాళ్ల కదలికలను కూడా ట్రాక్ చేశారు. వీటితో పాటు అభిజ్ఞా పనితీరును కూడా పరీక్షించారు. ఫైనల్‌గా వెలువడిన ఫలితాల్లో తీవ్రమైన OSA ఉన్నవారు రాత్రి సమయంలో బిగ్గరగా చేసే శబ్దాల వల్ల తక్కువ అప్రమత్తత, అధ్వాన్నమైన కార్యనిర్వాహక పనితీరు(టార్గెట్స్ రీచ్ కావడం, దృష్టి కేంద్రీకరించడం) కలిగి ఉండగా.. షార్ట్ టర్మ్ మెమొరీ కూడా దారుణంగా ఉంది. ఇక గురక తక్కువగా ఉన్నవారు అభిజ్ఞాత్మకంగా మెరుగ్గా పనిచేశారు. కాగా గురకతో బాధపడుతున్నవారిలో నిద్రించేటప్పుడు ఆక్సిజన్ స్థాయిలు లేదా మెదడుకు రక్త ప్రవాహంలో తగ్గుదల ఉందన్న పరిశోధకులు.. OSA ద్వారా నేరుగా సంభవించే అభిజ్ఞా లోపాలను ఇతర అనారోగ్యాలు మరింత తీవ్రతరం చేసి శాశ్వతం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: థమ్స్ అప్, పెప్సీ తాగితే క్యాన్సర్, హార్ట్ ఎటాక్!