సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్న పోషకాహార లోపం

by Prasanna |   ( Updated:2023-04-07 08:48:37.0  )
సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్న పోషకాహార లోపం
X

దిశ, ఫీచర్స్ : మనం తీసుకునే ఆహారం ఫిజికల్ హెల్త్‌‌తో పాటు మెంటల్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు ప్రముఖ న్యూట్రిషన్స్. అందుకే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పోషకాలున్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు. లేదంటే శారీరకంగా దృఢంగా అనిపించినప్పటికీ నాలెడ్జ్ విషయంలో వెనుకబడిపోతారని హెచ్చరిస్తున్నారు. పోషకాహార లోపం కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతుందని.. వీటిని పెంపొందించుకునేందుకు సూపర్‌ఫుడ్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

పెర్ఫోరేట్ సెయింట్ జాన్స్-వోర్ట్ :

గడ్డి జాతికి చెందిన ‘పెర్ఫోరేట్ సెయింట్ జాన్స్ వోర్ట్’ అనే మొక్కలో ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలను కలిగిన ఈ మొక్క డిప్రెషన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐరోపాకు చెందిన దీన్ని వృక్షశాస్త్రపరంగా ‘హైపెరికమ్ పెర్ఫొరాటమ్’ అని పిలుస్తారు. విశాలమైన ఆకులు, పసుపు రంగు కలిగిన నక్షత్ర ఆకారపు పువ్వులతో కూడిన మొక్క సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది. దీన్ని పౌడర్, లిక్విడ్, డ్రగ్ రూపంలోనూ తీసుకోవచ్చు. అతిగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కవా కవా :

కవా అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాలలో పెరిగే పొడవైన పొద. కొమ్మలు కొమ్మలుగా దట్టంగా పెరిగే ఈ పెద్ద పొద మనిషి గుండె ఆకారపు ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. ఇది ఆందోళనకు సంబంధించిన లక్షణాలను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే నరాల పనితీరును కంట్రోల్ చేసి మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. మానసిక స్థితిని పెంపొందించడంతోపాటు డిప్రెషన్ లక్షణాలను దూరం చేస్తుంది. ఉష్ణమండల సతత హరిత పొదగా పిలవబడే మూలికా ఔషధ శాస్త్రీయ నామం ‘పైపర్ మెథిస్టికమ్’. దీని కాండాన్ని నారగా చేసి దానినుంచి తీసిన రసాన్ని మార్కెట్లో అమ్ముతారు.

జింకో బిలోబా:

ప్రపంచంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే మూలికా సప్లిమెంట్లలో జింగో బిలోబా ఒకటి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన మొక్క కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుతోపాటు అనేక చికిత్సలకు ఔషధంగా ఉపయోగించబడుతుంది. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి, అలసటకు చికిత్సగా ప్రసిద్ధి చెందింది. మానసిక స్థితిని పెంపొందిస్తూ డిప్రెషన్ లక్షణాలను నియంత్రించడంలో కీ రోల్ పోషిస్తుంది. పెద్దగా పెరిగే ఈ చెట్టు యొక్క ఫ్యాన్ ఆకారం కలిగిన ఆకులు సప్లిమెంట్లలో చేర్చబడతాయి. చైనాకు చెందిన ఈ మొక్కను ‘మెయిడెన్‌హెయిర్ ట్రీ’ అని కూడా పిలుస్తారు. ఈ రకానికి చెందిన ట్రీ ఇదే చివరి జీవజాతి కాగా దీన్ని కాపాడేందుకు చైనా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి: Drumstick Seeds: మునగ గింజలు వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed