Viral video: పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. ఆపరేషన్ చేస్తుండగా ఆమె చేసిన పనికి వైద్యులే షాక్!

by Javid Pasha |   ( Updated:2024-06-21 15:34:22.0  )
Viral video: పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి.. ఆపరేషన్ చేస్తుండగా ఆమె చేసిన పనికి వైద్యులే షాక్!
X

దిశ, ఫీచర్స్: ఆస్పత్రులు, అక్కడ జరిగే చికిత్సలు అంటే చాలా సీరియస్ విషయాలుగా పరిగణిస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఊహించని షాకింగ్ ఘటనలు కూడా జరుగుతుంటాయి. కొన్ని కంట తడిపెట్టిస్తే, మరికొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ గర్భిణి పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు నార్మల్ డెలివరీ కానందున వైద్యులు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి సర్జరీ చేయడం స్టార్ట్ చేశారు.

నిజానికి ఆపరేషన్ సమయంలో ఎవరైనా భయపడతారు. కానీ సదరు మహిళ మాత్రం కొంచెం కూడా భయపడకపోగా.. ఆపరేషన్ మధ్యలో ఉన్నంటుండి వైద్యులకే షాక్ ఇచ్చింది. ఏంటంటే.. ఓ వైపు డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే.. ఎంచక్కా ఆమె స్వీట్ వాయిస్‌తో శ్రీకృష్ణుడి పాట పాడటం మొదలు పెట్టింది. డాక్టర్లు కూడా ఆ సాంగ్‌ను ఇంట్రెస్ట్‌గా వింటూనే ఆపరేషన్ కొనసాగించారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. ‘తల్లీ నీ ధైర్యానికి హ్యాట్సాప్’ అంటూ కొందరు. చక్కగా పాడావంటూ మరికొందరు సదరు మహిళను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేయండి!

Advertisement

Next Story